– డాక్టర్ ప్రీతి కుటుంబానికి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శ
జనంసాక్షి , మంథని :అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుంటుందని బీఆర్‌ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ డాక్టర్ ప్రీతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండా గ్రామంలో డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం అన్ని.ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. దోషులు ఎవరైనా ప్రభుత్వం గుర్తించి వారిపై కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.




