జనం సాక్షి , కమాన్ పూర్ : సర్పంచ్, కేశోరామ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సూర సమ్మయ్య కన్నల గ్రామ శాఖ అధ్యక్షులు, గన్ శామ్దాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి పలువురు ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి కన్నాల బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారిలో మౌటం రవి, దండుగుల సమ్మయ, బికే సాగర్, అభి బాగు, దేశం సహూ, మందల సంపత్ రెడ్డి, బదవత్ బలు నాయక్, బీమా నాయక్, దేవ్ నాయక్, సమ్మయ నాయక్ తదితరులు ఉన్నారు. వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.




