జనంసాక్షి, రామగిరి : అకాల వర్షాలకు ధాన్యం తడిసిన రైతులకు భరోసా కల్పించేందుకు సోమవారం రామగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు బీఆరెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా మండలంలోని బేగంపేట్, నవాబ్ పేట్, రత్నాపూర్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన దాన్యాన్ని పరిశీలించిన నాయకులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని తెలిపారు. మాయిచ్చరు వచ్చిన వెంటనే కాంటాలు త్వరితగతిన చేపట్టాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తడిసిన ధాన్యంతో రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు జరిగేలా చర్యలు చెప్పడతామని రైతులకు భరోసా కల్పించారు. ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా కవర్లు కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మేదరవేణి శారద కుమార్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, బీఆరెస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్, సర్పంచులు పల్లె ప్రతిమ పీవీ రావు, బుర్ర పద్మ శంకర్ గౌడ్, గాజుల ప్రశాంతి, గాజుల ప్రసాద్, ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్, ఉపసర్పంచ్ దుబ్బాక సత్యరెడ్డి, బీఆరెస్ పట్టణ అధ్యక్షులు రాచకొండ లక్ష్మణ్, ఓలపు బాపు, బాద్రపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




