Monday, 2 November 2026

మల్యాల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 2018 బ్యాచ్ కి చెందిన మహిళా కానిస్టేబుల్ వేదశ్రీ ఈరోజు విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మల్యాల సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

 

 

 

 

 

వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పి గారు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి ప్రమాదానికి గల కారణం అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. అనతరం వేద శ్రీ భౌతిక కాయానికి జిల్లా ఎస్పి గారు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు వేద శ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వేద శ్రీ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నివాళులు అర్పించిన వారిలో SB ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, మల్యాల సి.ఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి మరియు ఇతర పోలీస్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.