Tuesday, 3 November 2026

అధైర్య పడవద్దు..అండగా ఉంటాంరైతులకు భరోసా ఇచ్చిన పన్నుర్ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి

 

 

 

 

 

జనంసాక్షి ,రామగిరి : అకాల వర్షాలకు ధాన్యం తడిసిన రైతులకు భరోసా కల్పించేందుకు మంగళవారం రామగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పన్నుర్ సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని పన్నుర్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలిం చిన సర్పంచ్ అధైర్య పడవద్దని అండగా ఉంటామని తెలిపారు. మాచర్ వచ్చిన వెంటనే కాంటాలు త్వరితగతిన చేపట్టాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తడిసిన ధాన్యంతో రైతులకు ఇబ్బంది కలుగకుండా కొనుగోలు జరిగేలా చర్యలు చెప్పడతామని రైతులకు భరోసా కల్పించారు. ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు ధాన్యం తడవకుండా కవర్లు కప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు.