మెదక్, మే 3, 2023జనం సాక్షి ప్రతినిధి మెదక్2023-24 విద్యా సంవత్సరమునకు మహిళా శిశు సంక్షేమా శాఖ లేదా జువైనల్ జస్టిస్ కేర్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఆక్ట్ 2015 నుండి సర్టిఫికెట్ పొంది అన్నదా మరియు తల్లిదండ్రులు లేని బాల బాలికలకు హాస్టల్ వసతి కల్పిస్తూ విద్యను బోధించుటకు నూతన నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున పై సంస్థల నుండి అనుమతి పొందిన ఆసక్తి గల నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు దరఖాస్తు ఫారం ఇతర వివరాల కోసం కలెక్టరేట్ లోని తమ కార్యాలయం నందు పనివేళలలో సంప్రదించి పూర్తి చేసిన దరఖాస్తు వెంట సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 9 లోగా అందజేయవలసినదిగా ఆమె సూచించారు.




