Tuesday, 3 November 2026

అనఘాష్టమి వ్రతం విజయవంతం చేయండి

అనఘాష్టమి వ్రతం విజయవంతం చేయండి

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 30(జనం సాక్షి)

 

డిసెంబర్ 16న ఉదయం 9 గంటలకు హనుకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో

నిర్వహించే అయిత అనఘాష్టమి వ్రతాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని అవధూత దత్తపీఠం మైసూర్ బాధ్యులు కళ్యాణ్ కిరణ్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్ లో గల దత్తక్షేత్రంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ కిరణ్ శర్మ మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వ్రతం వరంగల్ నగరంలో నిర్వహించడం అదృష్టదాయకమన్నారు. వరంగల్ నగరంలో దివ్యమైన క్షేత్రాలు ఉన్నాయని పురజనులంతా ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించి తమ కోరికలను కష్టాలను తీర్చుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ వ్రతం 10 వేల మంది దంపతుల చేత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన ఈ వ్రతాన్ని తిలకించి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద స్వామి వారి దివ్య దర్శనాన్ని చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అవధూత దత్త పీఠం మైసూర్ బాధ్యులు దిలీప్, నారాయణరావు తోపాటు విక్రమాదిత్య, గంగు ఉపేంద్ర శర్మ , విహెచ్పి బాధ్యులు అనుముల రమేష్, వామన్ రావు, రాజేంద్రప్రసాద్, సరళ, రాజ్యలక్ష్మి, లక్ష్మీ తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు