అనదాలకు చేయూత నివ్వాలి :అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి
శనివారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ సమాచార హక్కు చట్టం కమిషనర్ మహ్మద్ అమీర్ పుట్టినరోజు సందర్భంగా మాతృ శ్రీ అనాద ఆశ్రమం లో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. అనాదలను ఆదుకోవటం ప్రతి ఒక్కరి కనీస ధర్మమని అన్నారు. సామాజిక సేవ లో ముందు నుంచి భాగం పంచుకునే మహ్మద్ అమీర్ అభినందనీయులని, వారి పుట్టిన రోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేసి వారి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు అఫ్జల్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి , కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, బత్తుల శశికాంత్ యాదవ్, మేడ్చల్ జిల్లా కేసిఆర్ సేవాదళం కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, బుర్క వెంకటేష్ అనాద ఆశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
31ఎస్పీటీ -2: ఆశ్రమంలో పండ్లు పంచుతున్న నాయకులు
అనదాలకు చేయూత నివ్వాలి :




