Monday, 2 November 2026

మోత్కూర్ శాఖా గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించిన జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారిణి శ్రీమతి కాపర్తి కవిత-సైమన్

మోత్కూర్ శాఖా గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరించిన జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారిణి శ్రీమతి కాపర్తి కవిత-సైమన్

మోత్కూరు డిసెంబర్ 31 జనంసాక్షి : మోత్కూర్ శాఖా గ్రంథాలయానికి జిల్లా బాలల పరిరక్షణ అధికారిని కాపర్తి కవితా సైమాన్ జే.ఈ.ఈ మెయిన్స్, ఎంసెట్ కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ని గ్రంథాలయ చైర్మన్ కోమటి మత్స్యగిరి కి అందజేశారు.తమ పిల్లలు కాపర్తి ఏంజిల్ షీభా, జాన్సన్ సూచనల మేరకు విలువైన స్టడీ మెటీరియల్స్ ని అందించినట్లు కవిత తెలిపారు.మోత్కూర్ శాఖా గ్రంథాలయం 10 వేల పుస్తకాల సేకరణలో తాము సైతం భాగస్వామ్యులం కావాలని పుస్తకాలు బహుకరీంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాఖా గ్రంథాలయం పక్షాన కోమటి మత్స్యగిరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు,జిల్లా అక్రిడేషన్ మెంబర్ ఎలిమినేటి జహంగీర్,గ్రంథాలయ ఇంచార్జ్ చిలకమర్రి బాబు చారి,డైరెక్టర్ దొంతోజు శ్రీనివాస్,పాఠకులు పాల్గొన్నారు.