అనారోగ్యంతో బాధపడుతున్న వీరన్న కు 2 లక్షల ఎల్ ఓ సి
* ఎల్ ఓ సి చెక్కునందించిన ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, డిసెంబర్ 6( జనం సాక్షి ): టేకులపల్లి మండలం మద్రాస్ తండా గ్రామపంచాయతీ లోని కొండెంగుల బోడు గ్రామానికి చెందిన జరుపుల వీరన్న అనే రైతు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాదులోని వైద్యశాలలో చికిత్స నిమిత్తం చాలా ఖర్చు చేసి ఉన్నాడు. మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరన్న పరిస్థితిని గమనించిన స్థానిక సర్పంచ్ మాలోతు రాజేందర్ నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే నిమ్స్ హాస్పటల్లో వైద్యులను సంప్రదించి చేర్పించారు. అందుకుగాను మంగళవారం రెండు లక్షల రూపాయల ఎల్ఓసి చెక్కును వీరన్న కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరన్నను ఎమ్మెల్యే స్పందించి వెంటనే నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లతో మాట్లాడి చేర్పించడమే కాకుండా వెంటనే ప్రభుత్వము నుండి 2 లక్షల రూపాయలను ఎల్ వో సి చెక్కును అందించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులుకృతజ్ఞతలు తెలిపారు.ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సహకరించిన సర్పంచ్ రాజేందర్ నాయక్ ను అభినందించారు.




