Thursday, 5 November 2026

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విశ్వ రత్న

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విశ్వ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తున్న రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు కొండమల్లేపల్లి డిసెంబర్ 6 జనం సాక్షి న్యూస్ :
మంగళవారం నాడు పట్టణ కేంద్రంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత విశ్వ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి అంజలి ఘటించి.. రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు మాట్లాడుతూ కొండమల్లేపల్లి’ దేవరకొండ పట్టణాలలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, అంబేద్కర్ విగ్రహానికి అర్పించారు నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీనలా ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ సమాజంలో ప్రజలందరి పక్షాన పోరాడి హక్కులు ప్రసాదించాడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న ,నల్గొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి ,నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ , కంబాలపల్లి వెంకటయ్య, జిల్లా నాయకులు అందుగుల లక్ష్మీనారాయణ, గంజి శీను, ఆడెపు సతీష్ , దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ ధర్మపురం శ్రీను, దేవరకొండ మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, కొండమల్లేపల్లి కన్వీనర్ గోపాల్ మరియు కొండమల్లేపల్లి సర్పంచ్ కుంభం శ్రీనివాసులు జెడ్పిటిసి సలహాదారుడు యుగె౦ధర్ తదితరులు పాల్గొన్నారు.