Wednesday, 4 November 2026

అనుచిత ప్రవర్తనపై వీడియో పుటేజ్‌ పరిశీలన

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి):  తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి ఛాంబర్‌లో శాసనసభాపక్షనేతల సమావేశంలో శనివారంనాటి గవర్నర్‌ ప్రసంగ సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో సభ్యుల ప్రవర్తనపై చర్చించారు. వీడియో పుటేజ్‌ను పరిశీలించిన శాసనసభాపక్ష నేతలు జాతీయ గీతాలాపన సమయంలో అనుచిత ప్రవర్తనపై చర్య తీసుకోవాలని నిర్ణయించారు. అనుచితంగా ప్రవర్తించిన సభ్యులపై చర్యకు నిర్ణయాధికారం స్పీకర్‌కు అప్పగించారు. స్పీకర్‌ తన నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తారని నిర్ణయించారు. ఈ మేరకు అనుచిత ప్రవర్తనకు పాల్పడిన సభ్యలుఉ క్షమాపణలు చెప్పాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *