Wednesday, 4 November 2026

జాతీయగీతం పట్ల అవమానంగా వ్యవహరించలేదు

మహిళలు, ఎస్సీలకు మంత్రిర్గంలో స్థానపం కోసంవ మాత్రమే ప్రశ్నించాంవిూడియా పాయింట్‌ వద్ద రేవంట్‌, ఎర్రబెల్లి వాదన
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): మంత్రివర్గంలో ఎస్సీలకుచ, మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తే తమను సస్పెండ్‌ చేశారని టిడిపి సభ్యులు అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ అన్నారు. దేశబక్తికి సబంధించి తమను శంకించాల్సిన అవసరం లేదన్నారు. జాతీయగీతంపై పొరపాటు జరిగితే వందసార్లు క్షమాపణ చెబుతామని రేవంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావులు  అన్నారు.మాదిగ, మాల, మహిళలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరితే సభనుంచి గెంటేశారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. దీనిపై ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. కడియం శ్రీహరి ఏ సామాజిక వర్గం వారో ఆయన నిరూపించుకోవాలన్నారు. కడియం శ్రీహరి తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ టీడీపీ నేతలను కోతులనడం ఆయన విజ్ఞతకే వదలిస్తున్నామన్నారు. శ్రీహరి ముందు తాను దళితుడని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. కడియం సామాజిక వర్గంపై ప్రభుత్వం కమిటీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కల్లుతాగిన కోతులే రావణుడిని అంతం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు.   గోతికాడ నక్కలా… మాలమాదిగల రిజర్వేషన్‌ను కడియం కొట్టేశారన్నారు. కడియం కులంపై నిజనిర్ధారణ జరగాలన్నారు. తాము గోతికాడి నక్కలం కాదని, దొరగారి కాపలాకుక్కలం అంతకన్నా కాదని రేవంత్‌ రెడ్డి అన్నారు. టీడీపీ వానర సైన్యంగా ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. కడియం ముందు తాను ఏ సామాజిక వర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారో నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌? అసెంబ్లీ ఎక్కడి సభ్యుడిగా కొనసాగుతారో కడియం తేల్చుకోవాలన్నారు. రాష్ట్రమంత్రిగా ఉండి ఎంపీగా కడియం కొనసాగడమేంటని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ కేబినెట్లో మాలలు, మాదిగలకు అవకాశం ఇవ్వాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో మాదిగ, మాల, మహిళలకు స్థానం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీ.కేబినెట్లో మాల,మాదిగ, మహిళలకు స్థానం కల్పించాలంటూ తమ పార్టీనేత మోత్కుపల్లి నర్సింహులు ఇందిరాపార్క్‌ వద్ద దీక్షకు దిగుతున్నారన్ని, ఆ దీక్షకు అందరూ మద్దతు పలకాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ఇదే విషయంలో అవసరం అయితే సభను స్తంభింపచేస్తామని ఆయన తెలిపారు. మాల,మాదిగ, మహిళలకు న్యాయం జరిగేలా టీడీపీ పోరాటం చేస్తుందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.తెలంగాణ సమాజం మొత్తం కెసిఆర్‌ ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నదని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.   అహంభావంతో తమను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసిందని వారు అన్నారు. స్పీకర్‌ మదుసూదనాచారి కూడా ప్రభుత్వానికి అండగా ఉంటున్నారని,ఇది మంచిది కాదని, ఎమ్మెల్యేలపై దాడి జరిగితే ఆ ఫుటేజీ చూపించాలని అన్నారు. జర్నలిస్టుల ముందు ఫుటేజీ చూపి తప్పు చేస్తే శిక్షకు సిద్దమని అన్నారు. జాతీయ గీతం అని ప్రకటించ లేదని,జాతీయ గీతం ఆరంభం కాగానే అందరం సైలెంట్‌ అయ్యామని ఆయన అన్నారు.టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల దౌర్జన్యంపై  వీడియో ఫుటేజీ ఎందుకు చూపించలేదని ,వాటి గురించి మాట్లాడడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ అహంకారం తో వ్యహరిస్తున్నారని  విమర్శించారు.జాతీయ గీతంపై క్షమాపణ చెప్పడానికి సిద్దమని, కాని మొత్తం వీడియో ఫుటేజీ చూపాలని ఎర్రబెల్లి అన్నారు.శాసనసభలో గొంతెత్తితే సస్పెండ్‌ చేస్తారా అని ఆయన అన్నారు.టిఆర్‌ఎస్‌ కార్యకర్తకు వీడియో కాంట్రాక్టు ఇచ్చారని,ఆయన వీడియో సిడీలను మాయం చేశారని అన్నారు.మాదిగ,మాలలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరితే సభనుంచి బయటపకు పంపుతారా అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *