Wednesday, 4 November 2026

తెలంగాణ శాసనసభలో గందరగోళం

p7z26faiజాతీయగీతానికి అవమానంపై చర్యలకు శ్రీకారం
సమావేవాలు ముగిసే వరకు టిడిపి సభ్యుల సస్పెన్షన్‌
నిరసనగా బిజెపి వాకౌట్‌…అధికార సభ్యులపైనా చర్యకు జానా డిమాండ్‌తప్పు చేస్తే తమవారూ క్షమాపణలకు సిద్దమన్న
హరీష్‌ రావు
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేవౄలు సస్పెన్షన్లతో మొదలయ్యాయి. శనివారం అసెంబ్లీ సమావేశాలు  గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమయ్యే సందర్బంలో జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో కొందరు గొడవ చేశారు. దీనిపై సోమవారం వీడియో ఫుటేజి చూసిన సభ్యులు ఇందుకు కారకులైన వారిని క్షమాపణలు చెప్పాలని నిర్ణయించారు. దీనిపై సభలో టిడిపి సభ్యులు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు. దీంతో సభనుంచి డీపీ సభ్యులను సస్పెండ్‌ చేసారు. ఇందులో అధికార పక్షసభ్యులు ఉన్నా చర్య తీసుకోవాలని విపక్షనేత జానారెడ్డి డిమాండ్‌ చేశారు. అలాగే కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ కుమార్‌ సభకు క్షమాపణ చెప్పారు. అయితే కేవలం విపక్షాలనే టార్గెట్‌ చేశారని ఆరోపిస్తే బిజెపి వాకౌట్‌ చేసింది.  సభ ప్రారంభమైన వెంటనే శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… సభ హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమాన పరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలని సూచించారు.గౌరవ సభ్యులు క్షమాపణ చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య మినహా మిగతా టీడీపీ సభ్యులంతా సస్పెండ్‌ అయ్యారు. సోమవారం ఉదయం సభ మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. జాతీయ గీతాన్ని అవమానపరచినందుకు క్షమాపఫణలు చెప్పాలని సభా వ్యవహరాల మంత్రి హరీష్‌ రావు తీర్మానించారు. దీనికి నిరాకరించడమే గాకుండా, ఇతర అంశాన్ని తీసుకుని  ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులను బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు సభలో ప్రతిపాదించారు. దీనికి స్పీకర్‌ అనుమతించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, అరికిపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌, కృష్ణారావు, ప్రకాష్‌గౌడ్‌, రాజేందర్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య, వివేకానంద, సాయన్న సస్పెండ్‌ అయిన వారిలో ఉన్నారు. విపక్షాల నిరసనలు, నినాదాలతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యాంగానికి విరుద్ధంగా తెలంగాణలో మాలలు, మాదిగలకు అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణ టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే  అంతకు ముందు హరీష్‌ రావు మాట్లాడుతూ జాతీయ గీతాన్ని అవమానించిన టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  క్షమాపణ చెప్పకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన…స్పీకర్‌ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. సభను అడ్డుకునేందుకే టీడీపీ సభ్యులు యత్నిస్తున్నారని హరీష్‌ రావు అన్నారు.  సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్‌ …ఆందోళన చేస్తున్న సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.  దాంతో హరీష్‌ రావు ఆందోళన చేస్తున్న సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు ఫైర్‌  అయ్యారు. జాతీయగీతాన్ని అవమానించిన టీడీపీ ఎమ్మెల్యేలు సభకు క్షమాపణ చెప్పాలని మంత్రి కోరారు. ఇది జాతికి అవమనామన్నారు. ఇలాంటి చర్యకు పాల్పడడం అవమానకరమన్నారు. ఇందుకు స్పీకర్‌ టీడీపీ సభ్యులకు మూడు సార్లు మైక్‌ ఇచ్చిన క్షమాపణ చెప్పకుండా గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలకు సభ జరగడం ఇష్టం లేదన్నారు. ఆటంకం కలిగించేందుకు మాత్రమే వారు సభకు వచ్చారని పేర్కొన్నారు. మూడు సార్లు మైక్‌ ఇచ్చినా వారు సభకు క్షమాపణ చెప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. సభకు పదేపదే ఆటంకం కలిగిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలని మంత్రి ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  తెదేపా సభ్యులను బ్జడెట్‌ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు.  కాగా అంతకు ముందు జాతీయ గీతాన్ని అవమానపరిచిన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అంతకు ముందు మంత్రి హరీష్‌ రావు సూచించారు.  అయితే వారు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించటంతో పాటు సభలో ఆందోళన కొనసాగిస్తుండటంతో టీడీపీ సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్‌ చేయాలని హరీష్‌ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని స్పీకర్‌ ఆమోదించారు. అయితే సభ నుంచి సస్పెండ్‌ అయినా కూడా టీడీపీ సభ్యులు మాత్రం స్పీకర్‌ పోడియం వద్ద తమ నిరసన కొనసాగించడంతో వారిని మార్షల్స్‌ బయటకు పంపారు.

శాసనసభలో సభ్యులు క్రమశిక్షణ పాటించాలి

సభలో సభ్యులు క్రమశిక్షణ పాటించాలని  కాంగ్రెస్‌ పక్షనేత జానారెడ్డి అన్నారు. జాతీయగీతం ఎవరు ఎవరు అవమాన పరచినా క్షమాపణలు చెప్పాల్సిందేననన్నారు.  జాతీయ గీతాలాపన సమయంలో తమ పార్టీ సభ్యుడి ప్రవర్తనపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ క్షమాపణలు చెప్పడం తప్పదన్నారు.  గవర్నర్‌ ప్రసంగం సమయంలో సభలో జరిగిన ఘటనలు స్పష్టంగా వీడియోలో లేవని సభ దృష్టికి తెచ్చారు. సభలో ఏం జరిగిందన్నది అందరూ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మరో సారి వీడియో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలను సభముందుంచాలన్నారు.

సంపత్‌ కుమార్‌ క్షమాపణలు

జాతీయగీతం సందర్భంలో తాను ప్రవర్తించిన తీరుకు కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ కుమార్‌ సభకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తాను కావాలని ఎలాంటి అనైతికతకు పాల్పడలేదన్నారు.

కొందరు తమ సంస్థలలో జాతీయగీతం పాడించడానికి సిద్దపడనివారు , రాజకీయం కోసం ఈ వివాదం లేవనెత్తారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ వ్యాఖ్యానించారు. గవర్నర్‌ దృష్టికి సమస్యను తేవాలని ప్రయత్నం చేశామని,యావత్‌ సభ ఆర్డర్‌ లో లేదని ఆయన అన్నారు. జాతీయగీతం ప్రకటన ముందు రాలేదని అన్నారు. ఫుటేజీ చూస్తే చాలామంది క్షమాపణ చెప్పాలని అన్నారు. జాతీయగీతానికి అవమానం రాకూడాదని భావిస్తున్నానని అన్నారు. అయితే తమ నాయకుడు జానారెడ్డి సూచన మేరకు తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు. మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ చుట్టూ తిప్పి రాజకీయం చేయడం సరికాదని అన్నారు. జానారెడ్డి గౌరవంగా మాట్లాడారని అన్నారు. స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని అన్నారు. సంపత్‌ మాట్లాడుతూ జాతీయ గీతం ఒక్క కాంగ్రెస్‌ కే కాదని,నూటిరవైకోట్ల మందికి వర్తిస్తుందని అన్నారు. స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ సూటిగా క్షమాపణ చెప్పాలని సంపత్‌కు సూచించారు. .జనారెడ్డి అనుభవం, గౌరవ మర్యాదలకల నేత అని హరీష్‌ అన్నారు. మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ జానారెడ్డి చెప్పినా వినడం లేదని,అందువల్ల కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ ను కూడా సస్పెండ్‌ చేయవలసి వస్తుందని హరీష్‌ అన్నారు. అయితే జానారెడ్డి జోక్యం చేసుకుని సంపత్‌ కు కొద్ది సమయం ఇవ్వాలని కోరారు. ముందుగా మనం ఆదర్శంగా ఉందామని ,క్షమాపణ చెప్పాలని సంపత్‌ ను కోరారు. జానారెడ్డి ఆదేశించిన విధంగా ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, తప్పు అని అనుకుంటే, ఒకవేళ పొరపాటున జరిగి ఉంటే,తనకు అలాంటి ఉద్దేశం ఉండదని,జరిగిన సంఘటనకు చింతిస్తున్నానని, బాధపడుతున్నానని ,క్షమించాలని కోరుతున్నానని సంపత్‌ కుమార్‌ అన్నారు.

జాతీయ గీతం ఆలాపన మొదలైనప్పటి నుంచి కొంత అల్లరి ఆరంభమైందని , దానిని మొత్తంగా వీడియో ఫుటేజిలో కనిపించలేదని విపక్ష నేత జానారెడ్డి చెప్పారు. ఎవరు ఆ సమయంలో తప్పు చేసినా చర్య తీసుకోవలసిందేనని అన్నారు. ఎవరు తప్పు చేసినా క్షమాపణ చెప్పించాలని అనుకున్నామని అన్నారు. అయితే వీడియో క్లిప్పింగ్స్‌ అన్ని పారదర్శకంగా కనిపించేలా చూపించాలని అన్నారు. అలాగే దాడికి సంబందించిన ఫుటేజీ కూడా చూపాలని అన్నారు. అధికారపక్షం కూడా ఇందులో ఉన్నారన్నారు. రెండు ఘటనలపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య స్పూర్తిగా ,జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పక్షాన తమ సభ్యుడు క్షమాపణ చెబుతారని అన్నారు. ఆయన ఉద్దేశపూరితంగా చేయనప్పటికీ అందుకు సిద్దమయ్యారని,కాని అదే సమయంలో మొత్తం వీడియోలను చూపించాలని అన్నారు. ఆ విూదట కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ మాట్లాడుతూ దాడి వీడియోలా ఫుటేజి ఇచ్చిన తర్వాత క్షమాపణ చెప్పడానికి సిద్దమన్నారు. కాని జానారెడ్డి మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నానని,ఆ తర్వాత దానిపై పట్టుబడుదామని అన్నారు

జాతీయగీతాన్ని గౌరవించని సభ్యులు దేశం విడిచి వెళ్లాలి

జాతీయ గీతాన్ని గౌరవించని సభ్యులు దేశం విడిచి వెళ్లాలని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. శాసన సభ్యులు తన విద్యాసంస్థల్లో జాతీయ గీతం ఆలాపించడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఆరోపించడంపై అక్బరుద్దీన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ గీతాన్ని తమ సంస్థల్లో పాటించని సభ్యులు ఉంటే సిగ్గుపడాలన్నారు. జాతీయ గీతాన్ని అవమానపరిచిన సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు. ఏ విద్యాసంస్థలు జాతీయగీతాన్ని పాడించడం లేదో వారి పేర్లు సంపత్‌ కుమార్‌ తెలపాలని, జాతీయ గీతం పాడించని వారిని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ జాతీయ గీతంపై, జాతీయ పతాకంపై గౌరవం ఉండాలని ఎమ్‌.ఐ.ఎమ్‌.నేత అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు.అలాంటి గౌరవం లేని వారు ఇండియన్‌ గా ఉండడానికి వీలు లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌ మాట్లాడుతూ జాతీయ గీతాన్ని తమ సంస్థలలో పాడించనివారు, తాము పాడనివారు దీనిని రాజకీయం చేశారని వ్యాఖ్యానించడంపై అక్బర్‌ మండిపడ్డారు.ఆ వ్యక్తులు,ఆ సంస్థలు ఎవరో తేల్చాలని ,వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పేరు చెప్పకుండా ఎవరిపైనో ఆరోపణ చేయడం సరికాదని అన్నారు.జాతీయ గీతాన్ని అవమానించినందుకే కాకుండా, సభను అవమానించినందుకు కూడా ఆ సభ్యుడు క్షమాపణ చెప్పాలని అక్బర్‌ డిమాండ్‌ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *