చిలప్ చెడ్/జూన్/జనంసాక్షి :-రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు రైతు దినోత్సవ వేడుకలను చిట్కుల్ శిలాంపల్లి రైతు వేదిక వద్ద మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఫైజాబాద్ గేట్ నుండి ఎడ్ల బండ్లు ట్రాక్టర్లతో శిలాంపల్లి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించినారు అలాగే చిట్కుల్ మెయిన్ రోడ్ నుండి గ్రామంలో వీధులలో డప్పు చప్పులతో, ట్రాక్టర్లతో, గిరిజనుల నృత్యాలు, మహిళలు డాన్స్ లతో ర్యాలీతో ఈ రైతు దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ శోభ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ శోభ మాట్లాడుతూ.. చిరుధాన్యాల పంటలు పండించాలని, కన్నతల్లి కన్నా గొప్పది మన భూమి అని ఆమె అన్నారు. మన ఉత్పత్తులు మనమే తినాలన్నారు. వరిగడ్డి తగలపెట్టవద్దని ఆమె అన్నారు. వరి గడ్డి తగలపెట్టినట్లయితే 10 సంవత్సరాల తర్వాత ఏం పంట పండించలేమని ఎన్ని బస్తాల యూరియా వేసిన భూమిలో సూక్ష్మ వ్యవస్థ నాశనం అవుతుందని ఆమె అన్నారు. వైస్ ఎంపీపీ విశ్వంరస్వామి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి వికలాంగులకు 3016 పింఛన్ ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పథకం రైతుబంధు రైతు బీమ తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేఅని, హనుమంతుడు లేని గుడి లేదు తెలంగాణలో ప్రభుత్వ పథకం లేని ఇల్లు లేదు అని ఆయన అన్నారు.ర్యాలీలో 500 మంది, మీటింగ్ లో 1100 వందల మంది,అనంతరం భోజనాలు సంహపక్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి, సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఏఈఓ రమ్య, ఎంపీడీవో శశి ప్రభ, తాసిల్దార్ ముసాదిక్, ఆర్ ఐ, వైస్ ఎంపీపీ విశ్వంభస్వామి,సోమక్క




