నెన్నెల, మే 25, (జనంసాక్షి )
నెన్నెల మండలం జంగల్ పేట గ్రామానికి చెందిన మానెపల్లి జంపయ్య అనే వ్యక్తి నెన్నెల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మే 27న జంగల్ పేట నుంచినెన్నెల తహసీల్దార్ కార్యాలయానికి బైక్ పై వస్తు తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈ విషయం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా, పోలిసులు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి అట్టి ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి, ఫోన్ దొరికిన వ్యక్తి వద్దనుంచి మొబైల్ ఫోన్ తీసుకు వచ్చి బాధితునికి శనివారం అప్పగించినట్లు ఎస్సై శ్యామ్ పటేల్ తెలిపారు. బాధితుడు జంపయ్య పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నచో అట్టి ఫోన్ వివరాలు సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసుకుంటే ఫోన్ ట్రేస్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్స్ దొరికితే పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని సూచించారు. అలా దొరికిన వస్తువులు తమ వద్ద ఉంచుకోవడం నేరం అని వివరించారు.
పోగొట్టుకున్న ఫోన్ అప్పగించిన పోలీసులు.




