Wednesday, 4 November 2026

అనునిత్యం రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది – రుద్రూర్ లో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

 

 

రుద్రూర్, జూన్ 3 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్ 3 వ తేది శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల ప్రజాప్రతినిధులు, రైతులు కలిసి రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం నుండి రైతు వేదిక భవనం వరకు ట్రాక్టర్లతో, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రైతుబిడ్డగా ఆలోచించి, వ్యవసాయ రంగ పునరుజ్జీవనం కోసం సమగ్రమైన కార్యాచరణను అమలులోకి తెచ్చారన్నారు. వ్యవసాయానికి ప్రాణాదారమైన కరెంటు, సాగునీటి మీద దృష్టిని కేంద్రీకరించారని సూచించారు. అదేవిధంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. ప్రతినిత్యం రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతు సోదరులకు పెట్టుబడి నిధులను సమకూర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతు సంక్షేమమే పరమావధిగా భావించే ప్రభుత్వం కనుకనే తెలంగాణ ప్రభుత్వం ఆపత్కాలంలో రైతుకు కొండంత అండగా నిలిచిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పిటిసి నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, కో ఆప్షన్ మెంబర్ మస్తాన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్, అధికారులు తహసిల్దార్ ముజీబ్, ఎస్సై రవీందర్, ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపివో సాయిలు, ఏఈఓ శ్రావణి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.