Monday, 2 November 2026

అనుమానంతో వేధిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్యకుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు

 

 

 

 

 

 

 

 

ఇటిక్యాల (జనంసాక్షి) ఏప్రిల్ 30 : భార్యను అనుమానంతో వేధిస్తున్నాడని మద్యం మత్తులో భార్య భర్తను గొడ్డలితోమోది హతమార్చిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండల పరిధిలోని  మొగల్ చెరువు గ్రామంలో శనివారం మధ్య రాత్రి చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎఎస్సై అయ్యన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భర్త మంద దేవరాజు అలియాస్  మంద దేవదాస్ వయసు (35) 16 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా  భర్త మంద దేవరాజు భార్య అలివేలు పై అనుమానంతో వేధిస్తుండడంతో రోజు లాగానే పనికి వెళ్లి వచ్చిన తర్వాత భార్య అలివేలమ్మతో కలిసి మద్యం సేవించి ఇద్దరు మద్య మాట మాట పెంచుకున్నారు. భర్త దేవరాజు నిద్రలోకి జారుకున్న తర్వాత గొడ్డెలతో మోదీ హతమార్చినట్లు ఆయన తెలిపారు. తండ్రిని హత్య చేసినట్లు ఎవరికైనా సమాచారం ఇస్తే కూతురు కొడుకుని కూడా చూడకుండా  హత్య చేస్తానని హెచ్చరించడంతో పిల్లలు ఎవరికి సమాచారం ఇవ్వలేదు. ఆదివారం తెల్లవారుజామున లేచి ఇంట్లో నుండి ఏడుస్తూ బయటకు వచ్చిన పిల్లలును చుట్టుపక్కల వారందరూ రక్తపు మడుగులో ఉన్న మంద దేవరాజుని గమనించి ఇటిక్యాల పోలీస్ స్టేషన్ కు  సమాచారం అందించడంతో అలంపూర్ సీఐ సూర్యనాయక్, కోదండపురం ఎస్సై వెంకటస్వామి, ఇటిక్యాల ఏఎస్ఐ అయ్యన్న సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. మృతి చెందిన దేవరాజు అన్న రవి ఫిర్యాదు మేరకు అలివేలు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఏఎస్ఐ  అయ్యన్న తెలిపారు. మృతునికి కూతురు కుమారుడు ఉన్నట్లు తెలిపారు.