ఝరాసంగం ఏప్రిల్ 30 (జనంసాక్షి )తమ డిమాండ్ల సాధన కోసం వీవోఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఝరా సంగం మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏలు నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. వీవోఏల దీక్ష శిబిరంలో ఐకేపీ వీవోఏలు ఆకులు తిని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో ఐకేపీ వివోఏ లు వెట్టి చాకిరీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షురాలు పద్మారాణి, కార్యదర్శి నింగమ్మా ప్రధాన కార్యదర్శి ఖాజామియా, కోశాధికారి వసంత ,సిద్దన్న, మహ్మద్,సూర్ రెడ్డి, సిరాజ్, రాజు పటేల్,సుర్ రెడ్డి,మహమ్మద్,సోపియోద్దీన్,నర్సింలు,,మాధవి అనిత పద్మ ,మరియమ్మనాగమణి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.




