Thursday, 5 November 2026

అన్నదాతలను సన్మానించిన వాసవి క్లబ్

అన్నదాతలను సన్మానించిన వాసవి క్లబ్

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. దేశానికి వెన్నెముకగా కీర్తించబడుతున్న రైతన్నలను వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఘనంగా సన్మానించింది. మూడు రోజుల సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని సోమవారం కనుమ పండుగ సందర్భంగా మండలానికి చెందిన రైతులు దొంతి రెడ్డి పెదరామిరెడ్డి , ఒగ్గు సైదులు ,గుండెబోయిన వెంకన్న మలిగిరెడ్డి సైదిరెడ్డి , పోరెడ్డి శ్రీరామ్ రెడ్డి , గుర్రం జాన్ రెడ్డి లను పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించి వారు చేస్తున్న సేవలను కీర్తించారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గరిణె అరుణ , డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ రాచకొండ విజయలక్ష్మి , వాసవి మరియు వనితా క్లబ్ అధ్యక్షులు కొత్తా లక్ష్మణ్ వీరవల్లి శ్రీలత కోటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి గజ్జల కోటేశ్వరరావు , కోశాధికారులు యీగా భాగ్యలక్ష్మి , పోలిశెట్టి అశోక్ , సోమప్ప దేవాలయ చైర్మన్ రాచకొండ శ్రీనివాసరావు మాజీ జోన్ చైర్మన్ కందిబండ శ్రీనివాసరావు , ఆర్యవైశ్య పట్టణ మహిళా అధ్యక్షురాలు కందికొండ వాసంతి , వాసవి మరియు వనిత క్లబ్ సభ్యులు మురారి శెట్టి రమేష్ , ఊటుకూరు నటరాజ్ , పాల్వాయి గోపాలకృష్ణ , భువనగిరి అంజయ్య , పరమేశం , కళావతి , సువర్ణ ,పద్మ , నరసకుమారి , సంధ్య , ధనలక్ష్మి తదితరులున్నారు.