కాకినాడ,నవంబర్1(జనంసాక్షి): అన్నవరంలో కార్తీకమాసంలో భక్తుల రద్దీ, తెప్పమ¬త్సవం, ఇతర కార్యక్రమాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి, శని, ఆదివారాలు, సోమవారాల్లో రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కార్తీక పౌర్ణమితో పాటు శనివారాలు, ఆదివారాలు కూడా రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. సత్యదేవుని తెప్పమ¬త్సవానికి ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లుచేసామని ఈవో తెలిపారు.




