Wednesday, 4 November 2026

అన్నాతో కలిసి ఉద్యమిద్దాం: మాజీ ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ: అన్నా హజారేతో కలిసి లోక్‌పాల్‌ కోసం కృషి చేద్దామని మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ పిలుపునిచ్చారు. ఆయన జంతర్‌మంతర్‌ వద్ద అన్నా దీక్షా స్థలి నుంచి మాట్లాడారు. హజారే నిరాహార దీక్ష విరమించనున్న నేపథ్యంలో జనరల్‌ వీకే సింగ్‌ అక్కడికి వచ్చారు. సింగ్‌ చేతులమీదుగా అన్నా దీక్ష విరమించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17నెలల నుంచి అన్నాకు మద్దతుగా దేశంలో లోక్‌పాల్‌ కోసం ఉద్యమం జరుగుతోందన్నారు. దేశానికి అవినీతి పెను సమస్యగా మరిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో పెనుమార్పు రావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *