కెసిఆర్ సారథ్యంలో పేదలకు మంచిరోజులు
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
సంగారెడ్డి,ఫిబ్రవరి14(జనంసాక్షి): తెలంగాణలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని అన్ని వర్గాలకు లబ్ది చేకూరేలా ప్రజా సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. కేసీఆర్ సారథ్యంలోకొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని అన్నారు. రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముకని పేర్కొన్న గత ప్రభుత్వాలు రైతు నడ్డి విరిచాయన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రైతే రాజుగా చూడాలనుకున్న కేసీఆర్ స్వప్నం నెరవేరిందన్నారు. అందులోభాగంగానే రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. రైతు ప్రమాదశాత్తు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా పథకం కింద రూ.5లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మఒడి, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాకతీయులు, రెడ్డి రాజులు, కుతుబ్‌షాహీల కాలం నుంచి వస్తున్న అద్భుతమైన వారసత్వ సంపదగా నిలిచి పోయిన గొలుసుకట్టు చెరువులకు, రాష్ట్ర సర్కారు తిరిగి ప్రాణం పోస్తున్నది. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే పెద్ద సంఖ్యలో చెరువులను పునరుద్ధరించింది. వాటిని ఏడాది పొడవునా నీరు నింపి నిండుకుండలా మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. గతంలో వర్షపు నీటితో మాత్రమే నిండే ఈ చెరువులు ఒకదాని కింద ఒకటి చొప్పున పదుల సంఖ్యలో ఉండేవి. ఒక చెరువు నిండి మత్తడి దుంకి వృథాగా పోయే నీరు మరో చెరువులోకి చేరేది. వాలుకు అడ్డంగా నిర్మించిన ఈ చెరువులు ఒకదానితో మరొకటి అనుసంధానంగా ఉండేవి. ఇప్పటి వరకు వర్షపు నీటితో మాత్రమే నిండుతున్న ఈ చెరువులకు ఇప్పుడు వర్షాలు కురిసినా, కురవక పోయినా నీటితో నిత్యం కళకళలాడాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే ప్రాజెక్టుల కాలువలతో గొలుసుకట్టు చెరువులను అనుసంధాని స్తున్నదని అన్నారు. మిషన్ కాకతీయతో మంచి ఫలితలు వచ్చాయని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.
అన్నివర్గాలకు లబ్ది చేకూరేలా పథకాలు




