అన్ని దానాలలో కళ్ళ రక్త దానం గొప్పది..
సిద్దిపేట జిల్లా దుబ్బాక:—జనం సాక్షి దుబ్బాక.
అన్ని దానాలో కన్నా రక్తదానం గొప్పదని మన కోసం కె ఆర్ ఆర్ ఫౌండేషన్ అధినేత కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి అన్నారు.కోమటిరెడ్డి రజినీకాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆసుపత్రి సూపర్నెంట్ డాక్టర్ హేమ్రాజ్ సింగ్ వారి సహకారంతో సిద్దిపేట రక్త నిధి పంపించేందుకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం పౌండేషన్ సభ్యులు శ్రేయోభిలాషిలు మిత్రులు అందరు కలిసి ఆయన జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి జరిపారు.ఈ సందర్భంగా డాక్టర్ హేమరాజ్ సింగ్,సీఐ మున్నూరు కృష్ణ,కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి,లు మాట్లాడుతూ దుబ్బాక పట్టణ మరియు మండల కేంద్రంలోని వివిధ గ్రామాల లకు చెందిన యువకులు రక్తదాన కే ఆర్ ఆర్ ఫౌండేషన్ కార్యకర్తలు శిబిరానికి సుమారు 200 మంది రక్తదానం చేశారని సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్యేశం ఏమనంగా ఇటీవలి కాలంలో యువకులు రోడ్డు ప్రమాదాల గురవుతున్నారని రోడ్డు ప్రమాదాలకు యువకులు ప్రజలు గురి కవద్దని ఒక మంచి ఆలోచనతో కేర్ ఆర్ ఫౌండేషన్ ద్వారా యువకులకు దుబ్బాక పట్టణ మరియు మండల ప్రజలకు ఉచిత హెల్మెట్ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
అలాగే దుబ్బాక నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని సేవలు అందిస్తానని దానికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎస్సై గంగరాజు దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆస్పత్రి సిబ్బంది తోపాటు కేఆర్ఆర్ ఫౌండేషన్ కార్యకర్తలు అభిమానులు, సర్పంచ్ దేవిరెడ్డి,మూర్తి కరుణాకర్ రెడ్డి షేఖర్,తదితరులు పాల్గొన్నారు…