అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు డిసెంబర్ 8(జనంసాక్షి)అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదనిమార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ పేర్కొన్నారు. గురువారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా ఘన్ గాపూర్.లో ప్రసిద్ధిగాంచిన శ్రీ దత్తాత్రేయుని జయంతినీ పురస్కరించుకొని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విటల్ నాయక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విఠ
ల్ నాయక్ మాట్లాడుతూ దత్తాత్రేయుని జయంతి పురష్కరించుకుని పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారని అన్నారు. భక్తుల కోరికలు తీర్చే వర ప్రదాతగా విరజిల్లుతున్న శ్రీ దత్తాత్రేయ స్వామి కృపతో ప్రతి పౌర్ణమి రోజు ఆలయంలో వెలసిన స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తమని తెలిపారు.పౌర్ణమి నాడు దత్తాత్రేయుని విశేషంగా పూజించినవారు స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారని వేల్లడించారు.ఆలయ ప్రంగణంలో అన్నదానం నిర్వహించడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. అనంతరం
ఆలయ
ఆర్చకులువేదమంత్రోచ్ఛరణాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది




