తాండూరు నియోజకవర్గ టిఆర్ఎస్ వి అధ్యక్షులుగా జోగుల ఎబినేజర్.
నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు డిసెంబర్.8(జనంసాక్షి)నియోజకవర్గ టిఆర్ఎస్ వి అధ్యక్షులు గా జోగుల ఎబినేజర్ కు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు.బుధవారం రాత్రి తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన జోగుల ఎబినేజర్ ను టిఆర్ ఎస్ వి తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డిమాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడుప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని నూతనంగా ఎన్నికైన టిఆర్ ఎ స్ వి అధ్యక్షుడు ఎబినేజర్ కు సూచించారు.ఈ సందర్భంగా టిఆర్ ఎస్ వి నియోజకవర్గ అధ్యక్షుడు ఎబినేజర్ మాట్లాడుతూ నా పై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ,వారి సమస్యలను ఎప్పటికపుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,మరియు నాయకులు నూతనంగా ఎన్నికైన జోగుల ఎబినేజర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
తాండూరు నియోజకవర్గ టిఆర్ఎస్ వి అధ్యక్షులుగా జోగుల ఎబినేజర్.




