అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

నల్గొండ: చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. అప్పుల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికులు.. దాని నుంచి బయటకు వచ్చే మార్గం కనపడక బలవన్మరణానికి పాల్పడుతూనే ఉన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన చేనేత కార్మికుడు ఆనబత్తుల రవి (40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

తాజావార్తలు