హైదరాబాద్) : ప్రపంచానికే ఫార్మా కేంద్రం అయిన హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఫార్మా ఎగుమతుల మండలి (ఫార్మెక్సిల్) తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఐదో అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్ (ఐఫెక్స్) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్లలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో తొలిదశ ఫార్మాసిటీని నిర్మిస్తామని, దీనిలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు త్వరలోనే భూకేటాయింపులు చేస్తామని ఆయన తెలిపారు. ఔషధాల తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డి), టెస్టింగ్ వసతులు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలు ఈ దశలో ఏర్పాటవుతాయని కెటిఆర్ అన్నారు. త్వరలోనే దీనికి పర్యావరణ అనుమతులు లభిస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. 24 గంటలు నీరు, విద్యుత సరఫరా, ఉమ్మడి నీటి శుద్ధి ప్లాంట్ వంటి పరిశ్రమకు అవసరమయ్యే మౌలికవసతులతో పాటు ఆయా యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగుల కోసం నివాస గృహాల సముదాయాలు, పాఠశాలలు, రిక్రియేషన్ వసతులు వంటివన్నీ అందులో ఉంటాయని ఆయన తెలిపారు. మొత్తం ఫార్మా సిటీకి ఒకసారి పర్యావరణ అనుమతులు లభించినట్టయితే లోపల ఏర్పాటయ్యే యూనిట్లకు ఆ సిటీ యంత్రాంగమే పర్యావరణ అనుమతులు ఇవ్వగల సదుపాయం దీని ప్రత్యేకత అని కెటిఆర్ అన్నారు. ఫార్మా రంగం భవిష్యత వృద్ధిలో ఈ ఫార్మా సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. నభూతో నభవిష్యతి తరహాలో మౌలిక వసతులు కల్పిస్తున్న ఈ ఫార్మాసిటీలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్ల రంగాల్లోని దేశవిదేశీ కంపెనీలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇంతవరకు ముంబైలోనే జరుగుతున్న ఐఫెక్స్‌ను తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్న ఫార్మెక్సిల్‌ను అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా రెగ్యులేటర్లు, 25 మంది భారత రెగ్యులేటర్లు పాల్గొంటున్న ఈ సమావేశంలో నియంత్రణాపరమైన అంశాలపై సమూలంగా చర్చించడంతోపాటు ఫార్మా రంగం అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు అందించగలరన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీలో యూనిట్లు పెట్టండి
హైదరాబాద్) : ప్రపంచానికే ఫార్మా కేంద్రం అయిన హైదరాబాద్‌కు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామారావు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఫార్మా ఎగుమతుల మండలి (ఫార్మెక్సిల్) తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఐదో అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్ (ఐఫెక్స్) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్లలో 14 వేల ఎకరాల విస్తీర్ణంలో సకల సదుపాయాలతో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఎనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో తొలిదశ ఫార్మాసిటీని నిర్మిస్తామని, దీనిలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన కంపెనీలకు త్వరలోనే భూకేటాయింపులు చేస్తామని ఆయన తెలిపారు. ఔషధాల తయారీ, పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డి), టెస్టింగ్ వసతులు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, నైపుణ్యాల అభివృద్ధి కేంద్రాలు ఈ దశలో ఏర్పాటవుతాయని కెటిఆర్ అన్నారు. త్వరలోనే దీనికి పర్యావరణ అనుమతులు లభిస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. 24 గంటలు నీరు, విద్యుత సరఫరా, ఉమ్మడి నీటి శుద్ధి ప్లాంట్ వంటి పరిశ్రమకు అవసరమయ్యే మౌలికవసతులతో పాటు ఆయా యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగుల కోసం నివాస గృహాల సముదాయాలు, పాఠశాలలు, రిక్రియేషన్ వసతులు వంటివన్నీ అందులో ఉంటాయని ఆయన తెలిపారు. మొత్తం ఫార్మా సిటీకి ఒకసారి పర్యావరణ అనుమతులు లభించినట్టయితే లోపల ఏర్పాటయ్యే యూనిట్లకు ఆ సిటీ యంత్రాంగమే పర్యావరణ అనుమతులు ఇవ్వగల సదుపాయం దీని ప్రత్యేకత అని కెటిఆర్ అన్నారు. ఫార్మా రంగం భవిష్యత వృద్ధిలో ఈ ఫార్మా సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. నభూతో నభవిష్యతి తరహాలో మౌలిక వసతులు కల్పిస్తున్న ఈ ఫార్మాసిటీలో యూనిట్లు ఏర్పాటు చేసేందుకు బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్ల రంగాల్లోని దేశవిదేశీ కంపెనీలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఇంతవరకు ముంబైలోనే జరుగుతున్న ఐఫెక్స్‌ను తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్న ఫార్మెక్సిల్‌ను అభినందించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా రెగ్యులేటర్లు, 25 మంది భారత రెగ్యులేటర్లు పాల్గొంటున్న ఈ సమావేశంలో నియంత్రణాపరమైన అంశాలపై సమూలంగా చర్చించడంతోపాటు ఫార్మా రంగం అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు అందించగలరన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. 



