మల్కాజిగిరి.జనంసాక్షి.మే23 సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని అనవసరమైన రుణ యాపులు,గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్లకు స్పందించి మోసపోవద్దని రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి కోరారు.నెరెడ్ మెట్ సిఐ గా పని చేసి బదిలీ అయిన సందర్భగా డిఫెన్స్ కాలనీ సొసైటీ సభ్యులు ఆయన ను సన్మానించారు.ఈకార్యక్రమానికి కొత్త గా వచ్చిన సిఐ నాగరాజు హాజరయ్యారు.ఈసందర్భంగా
నరసింహ స్వామి మాట్లాడుతూ.
విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నారని,ఎటువంటి ఆధారం
లేకుండా రుణాలు ఇస్తామని,మీకు లాటరీ తగిలిందని వచ్చే సందేశాలకు సమాధానం ఇవ్వకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ వాట్సాప్ కాల్స్ చేస్తున్నారని దానికి సమాధానం ఇవ్వద్దని కోరారు.సైబర్ నేరగాళ్లు అనేక రకాల కుట్రపూరితమైన యాప్ ల ద్వారా ప్రజలనుంచి డబ్బులు గుంజాలని మోసాలకు తెరలేపుతున్నారు.ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే 1930 లో ఫిర్యాదు చేయాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు.సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.నెరెడ్ మెట్ లో పనిచేసిన కాలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు పోలీసు సిబ్బంది సహకారంతో నేరాలు నియంత్రించగలిగామని అన్నారు.కొత్త గా వచ్చిన సిఐ నాగరాజు మాట్లాడుతూ.శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు.స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాలు అరికట్టవచ్చు.




