Thursday, 5 November 2026

అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణఅప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి): అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడవచ్చని సూర్యాపేట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సిహెచ్. శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం నుండి ప్రారంభమైన అగ్నిమాపక దళ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం సంబంధించి,విధి నిర్వహణలో అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి జోహార్లు అర్పించడం,వారి ఆత్మశాంతికి ప్రార్థించడం,అగ్ని ప్రమాదాలు జరుగకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేస్తూ,ప్రజలను చైతన్యవంతులను చేయటం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే సమీప ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.అనంతరం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ లో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి,కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్ఎఫ్ శంకర్, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.