వలిగొండ జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 15 ఆరోపణలు వాస్తవం అని నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వలిగొండ గ్రామ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్ సవాల్ విసిరారు శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ సర్వేనెంబర్ 300 301302405406515లలొ5ఎకరాల27గుంటలబూమిలో వెంచర్ చేశారు ఆ వెంచర్ 2017 మార్చ్ లో జరిగింది అప్పుడు ఉన్న పాలకవర్గం అందులో గ్రామ పంచాయతీకి 750 గజాల భూమిని గ్రామపంచాయతీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వదిలి పెట్టారని వారే బాధ్యతవహించాలని అన్నారు 2017 లో మార్చిలో జరిగిన వెంచర్.కు మాకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు కొత్తగా వాటర్ పైప్ లైన్ కావాలని ఎమ్మెల్యేను కోరమని వివరించారు ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారు వారు వాస్తవాలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు మాపై ఆరోపణలు రుజువు చేయకుంటే న్యాయపోరాటం చేస్తామని అన్నారు మీకు దమ్ముంటే గ్రామ అభివృద్ధికి తనతో పాటు సహకరించాలి తప్ప తప్పుడు ప్రచారాలు తగదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కుందారపు యశోద కొమరయ్య పల్లెర్ల భాగ్యమ్మ రాజు వార్డు మెంబర్లు పల్లెర్ల సుధాకర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య మాజీ ఉపసర్పంచ్ పబ్బు సురేందర్ కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు.




