జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ మార్చి .6పలు గ్రామాల్లో పర్యటించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు సింగోటం రామన్న పలు సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందజేసిన రామన్న కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురుని కలిసి పరామర్శించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ అధ్యక్షుడు సింగోటం రామన్న ఈ సందర్భంగా మోల్ల చింతపల్లి గ్రామానికి చెందిన ధర్మేష్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకున్న సింగోటం రామన్న అతని ఆరోగ్య కర్చులను నిమిత్తం రూ “10000/- లు చెక్కును అతనికి అందించారు. మొల్లచింతపల్లి గ్రామ పోచమ్మ గుడి నిర్మాణానికి రూ” 50,000/- లు విరాళంగా ఇచ్చారు.మొల్లచింతపల్లి గ్రామంలోని మసీదు నిర్మాణానికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరపున రూ ” 30,000/- లు విరాళం అందించారు. పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గువ్వల రాముడు ఇంటికి వెల్లి అతని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు రామన్న గువ్వల రాముడు ఆరోగ్య ఖర్చులకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరుపున 10,000/- రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనారోగ్యం కారణంగా బాధపడుతున్న గువ్వల రాముడు అనే వ్యక్తిని పరామర్శించిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు రాజన్న,చింటూ, సందీప్, బబ్లు భాయ్ ,సాంసంగ్ రామన్న వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




