రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 07.(జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంపీటీసీ బైరినేని రాము ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. సోమవారం బైరినేని రాము ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ నీళ్లతో దాచారం చెరువు నింపి 500 మంది రైతుల పొలాలు ఎండిపోకుండా కాపాడినందుకు మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలభిషేక నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార బి ఆర్ ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తుంటే బైరిని రాము మాత్రం మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలభిషేక నిర్వహించడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో చినలింగాపూర్ వార్డు సభ్యులు పిట్ల రవి, గుర్రం రవి ,రాజేశ్వరరావు ,బాలరాజు, పోచయ్య, వెంకటేష్ పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు




