Tuesday, 3 November 2026

అభయుడి ఆలయంలో మాజీ మంత్రి ప్రత్యేక పూజలు..

 

 

 

 

– నూతన దుకాణాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి.ఊరుకొండ, జనవరి 27 (జనంసాక్షి):
నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మాజీమంత్రి చిత్తరంజన్ దాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరుకొండ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరామ దాణా షాప్ జ్యూస్ పాయింట్ దుకాణాన్ని మాజీ మంత్రి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిత్తరంజన్ దాస్, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దయ్య యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరై ముచ్చర్ల పల్లి పయ్యావుల శ్రీకాంత్ యాదవ్ నూతన దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ వెంకట బాల రామయ్య పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య, రాఘవేందర్, శ్రీరాములు, లక్ష్మణ్, విజేందర్, జంగయ్య, కళావతి, తదితరులు పాల్గొన్నారు.