కొండమల్లేపల్లి జనవరి 27 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి జడ్పీటీసీ పసునూరు సరస్వతమ్మ మరియు బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పసునూరు యుగేందర్ రెడ్డి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడును ఈ సందర్భంగా పసునూరు యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉస్మానియా క్యాంపస్ కి చెందిన డాక్టర్ నిఖిత ఎంఎస్ జనరల్ సర్జన్, డాక్టర్ స్వప్న డి జి ఓ గైనకాలజిస్ట్, డాక్టర్ మనోజ్ చరణ్ ఎంఎస్ జనరల్ సర్జన్, డాక్టర్ తీర్థారాణి ఎండి జనరల్ మెడిసిన్ నలుగురు డాక్టర్ల చే వైద్య పరీక్షలు నిర్వహించబడును ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటలవరకు వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్ నందు మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయనున్నారని ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు దీంతో పాటు కొండమల్లేపల్లి పట్టణ మరియు పరిసర గ్రామాలలోని ప్రజలందరు వివిధ రకలైన వ్యాధులతో అనేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉచితంగా ప్రతి ఒక్కరికి బీపీ, షూగర్, ఈసీజీ, గుండె సబంధిత పరీక్షలు, లెన్స్ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును అని తెలిపారు మహిళలందరి ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారి ఆరోగ్య సమస్యలు చూయించుకోవాలని కోరారు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.వి.టి, ఖాజా ఇతరులు పాల్గొన్నారు
కొండమల్లేపల్లి మండలంలో జడ్పిటిసి పసునూరు సరస్వతమ్మ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్




