అభివృద్ధికి తిరుగు లేదు.. రెడ్యాకు ఎదురు లేదు..
డోర్నకల్ డిసెంబర్ 8 జనం సాక్షి
గత నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గ అభివృద్ధే శ్వాసగా నిత్యం సామాన్యుడికి చేరువగా ఉంటూ ప్రతి అంశంపై సమగ్ర పట్టున్న పరిపాలనాదక్షకుడు ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అని మండలాధ్యక్షుడు నున్నా రమణ అన్నారు.గురువారం పట్టణ కేంద్రంలో విలేకరుల ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకి మోకాలి శస్త్ర చికిత్స జరగగా హైదరాబాదులో ఉన్నప్పటికీ ఆయన ఆలోచనలన్నీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిపైనే ఉన్నాయన్నారు.నిత్యం నియోజకవర్గం నుంచి వందలాది మంది ఆయనను పరామర్శించడానికి క్యూ కడుతున్నారని తెలిపారు.త్వరలోనే ఉగ్గంపల్లి లోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే రానున్నట్లు వెల్లడించారు.అలాగే పురపాలక అభివృద్ధికి మంజూరైన రూ.20 కోట్లలో నుంచి 40 లక్షలతో ఎస్సీ భవనం,వేడుకల వేదికను నిర్మిస్తున్నట్లు తెలిపారు.భవన నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కె.విద్యాసాగర్,కౌన్సిలర్లు సురేందర్ జైన్,పోటు జనార్ధన్,అశోక్, ఎంపీటీసీ కోటి,పుర కో ఆప్షన్ సభ్యులు మారబోయిన రాంబద్రం,మియా,నాయకులు న్యాయవాది రమేష్,ఇంజమ్ కృష్ణయ్య,సలీం,కొత్త వీరన్న,మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్ పాషా,అనిల్ తదితరులున్నారు.




