Thursday, 5 November 2026

మండలం లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పర్యటన

డిసెంబర్ 8 జనం సాక్షి ఇంద్రవెల్లి

మండలం లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పర్యటన*_

ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడ, మర్కగూడ, భూర్సాన్ పటార్ గ్రామాల్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు పర్యటించి దళిత బంధు పథకం అమలు పై ప్రజలకు అవగాహన కల్పించారు.దేశం లో ఎక్కడ లేని పథకాలు మన తెలంగాణ రాష్ట్రం సీఎం కెసిఆర్ గారు మనకు అమలు చేస్తున్నారని వారు అన్నారు.దళిత బంధు పథకం దేశానికే తలమానికం అని ఇతర రాష్ర్టాల ప్రజలు వారికి దళిత బంధు పథకం కావాలని అక్కడి ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.ఎవరి మాయమాటలు నమ్మి మోసపోవద్దు అని అన్నారు. అంతకు ముందు మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వారి వెంట ఇంద్రవెల్లి మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.