అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ
జీఎస్‌డీపీలో దేశంలో మూడో స్థానం మనదే
నాలుగు శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరుగుదల
ఆశీర్వాద యాత్ర పేరుతో కిషన్ రెడ్డి అబద్దాల ప్రచారం
బంగ్లాదేశ్ జిడిపితో పోటీపడుతున్న భారత్ª`ను గుర్తించాలి
విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని చెప్పారు. జీఎస్‌డీపీలో దేశంలో మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. దేశ జీడీపీకి కాంట్రిబ్యూషన్‌లో తెలంగాణది ఆరోస్థానం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు నాలుగు శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరిగిందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ మధ్య రాష్ట్రప్రభుత్వం గురించి పచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆశీర్వాద యాత్ర పేరుతో తెలంగాణ లో పర్యటిస్తూ కిషన్‌రెడ్డి అన్నీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణలో అభివృద్ది జరగడం లేదని, ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదనేటటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారని హరీష్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై అవగాహన లేకనో.. లేదా రాజకీయాల కోసమో కేంద్ర మంత్రి ఈ మాటలు మాట్లాడు తున్నారని మంత్రి హరీష్ స్ఫష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది ఒక శాతం జీడీపీ పెరుగుతున్నదని వెల్లడిరచారు. రాష్ట్రంలో సంపద పెరుగుదల, ఆర్థిక పరిస్థితిపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో మంత్రి హరీశ్ రావు విూడియాతో మాట్లాడారు. రాష్టాభ్రి
వృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపారేశారు. ªూష్టాన్రికి రావలిసిన ట్రైబల్ యూనివర్సిటీ గురించి కేంద్ర మంత్రి మాట్లాడితే బాగుంటుంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమయ్యిందో ప్రజలకు చెబితే సంతోషిస్తాం. ఐటీఐఆర్‌ను ఎందుకు రద్దు చేశారో, దాన్ని పునరుద్దరణ గురించి మాట్లా సబబుగా ఉంటుందని హరీష్‌రావు అన్నారు. తాము దేశాన్ని వృద్ధి చేశామని మాట్లాడు తున్న కిషన్‌రెడ్డి ఏరంగంలో వృద్ధి చేశారో చెబితే సంతోషిస్తామన్నారు. పెట్రోల్ రేట్లను పెంచడంలో మాత్రం దేశాన్ని వృద్ధి చేశారని హరీష్ ఎద్దేవ చేశారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర మంత్రికి తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని, మన తలసరి ఆదాయం 2,37,632 రూపాయలుగా ఉందని తెలిపారు. ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువని హరీష్‌రావు వెల్లడిరచారు. ఆరు సంవత్సరాల్లో దేశ తలసరి ఆదాయం 48.7 శాతం పెరిగితే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు రెట్టింపు అయిందని, ఇవన్నీ వాస్తవాలు కాదా? అని కిషన్‌రెడ్డిని హరీష్ ప్రశ్నించారు. మరో వైపు పన్నువసూళ్లలోనూ మనం 11.52 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నివేదికల నుంచే వివరాలు సేకరించామని చెప్పారు. రాష్టాల్రు, దేశాల వృద్ధిని పారా విూటర్ల ఆధారంగా లెక్కచేస్తారని తెలిపారు. కరోనా సంవత్సరంలోనూ 2.4 శాతం వృద్ధిరేటు సాధించామని స్పష్టం చేశారు. దేశంలో జీడీపీ మైనస్ 3 శాతం వృద్ధి నమోదయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ అవలంభించే విధానాలతోనే తెలంగాణ వృద్ధిరేటు పెరుగుతున్నదని చెప్పారు. బంగ్లాదేశ్ కంటే భారత్ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉందని ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1887 డాలర్లు కాగా, భారత్ తలసరి ఆదాయం 1877 డాలర్లని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,638గా ఉందన్నారు. ఏడేండ్లలో 3వ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని చెప్పారు. తలసరి ఆదాయాన్ని చూస్తే ఎవరి పనితీరు ఏందో ప్రజల ముందు ఉదని దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర తలసరి ఆదాయం 11.5 శాతం, దేశ తలసరి ఆదాయం 4 శాతం అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలో 10 స్థానంలో ఉన్నామని, ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు. పన్నువసూళ్లలో 11.52 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో దేశం వృద్ధిరేటు 3.6 శాతం అయితే.. తెలంగాణ వృద్ధి రేటు 14.3 శాతమన్నారు. తయారీ రంగంలో 72 శాతం, ఐటీ రంగంలో 120 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. ప్రాథమిక రంగంలో రాష్ట్రం దేశంలోనే అత్యంత అభివృద్ధి సాధించింద న్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, గ్రావిూణ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడంతో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 14.5 శాతం ఎక్కువ వృద్ధిరేటు సాధించామన్నారు. పశువుల పెంపకం రంగంలో మూడు రెట్లు, చేపల పెంపకంలో ఆదాయం రెట్టింపు అయిందన్నారు. వరి ఉత్పత్తిలో రూ.9,528 కోట్ల నుంచి రూ.47,440 కోట్లకు ఆదాయం పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే కోతలు లేని కరెంటు ఇచ్చే రాష్ట్రంగా ఎదిగామన్నారు. పరిశ్రమలు, సర్వీస్, నిర్మాణ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు. కేంద్రానికి ఇచ్చే నిధులు ఎక్కువ.. కేంద్రం
మనకు ఇచ్చేది తక్కువ అని విమర్శించారు.