అభివృద్ధి చూసే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
దేశానికే ఆదర్శం కేసీఆర్ గారి పాలన – ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు
టీఆర్ఎస్ పార్టీలో చేరిన బూర్గుల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు
ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గారు పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రాభివృద్ధి స్పూర్తితో దేశంలో కూడా స్వావలంబన కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.




