అభివృద్ధి నివేదికలను త్వరితగతిన అందివ్వాలి
-కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ బ్యూరో-నవంబర్14(జనంసాక్షి)
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకొని ఏర్పాటు చేసే కాన్ఫరెన్స్‌కు గత రెండు సంవత్సరముల ప్రగతి నివేదిక లు అందజే చేయాల్సి ఉన్నందున జిల్లా అధికారులందరూ 4 పేజీలకు మించకుండా నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నందున ఏర్పాటు చేసే కాన్ఫరెన్స్ కు జిల్లా ప్రగతి నివేదికలు అందించాల్సి ఉందని జిల్లా అధికారులందరూ అభివృద్ధి నివేదికలను త్వరితగతిన అందించాలన్నారు. మండల స్థాయి అధికారులు అందరూ ముందస్తు అనుమతి లేనిదే కార్య స్థానం విడిచి వెళ్లరాదని అప్రమత్తంగా ఉండాలన్నారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి బృహత్ పల్లె ప్రగతి వనాలను పర్యవేక్షించి అందంగా తీర్చిదిద్దాలన్నారు. నర్సంపేట నుండి మహబూబాబాద్ 365 జాతీయ రహదారి , మహబూబాబాద్ నుండి తానంచర్ల, తొర్రూరు నుండి నెల్లికుదురు మీదుగా మహబూబాబాద్ వరకు, వరంగల్ నుండి ఖమ్మం వరకు, మహబూబాబాద్ నుండి బయ్యారం వరకు, రహదారులను గుంతలు లేకుండా మరమ్మతులు చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాల పనులు పూర్తి చేయించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్, డేవిడ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.




