బాలల దినోత్సవం సందర్భంగా సోలిడాంద్ర బదిరుల పాఠశాలలో ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు
కొండమల్లేపల్లి నవంబర్ 14 జనం సాక్షి న్యూస్: మండల కేంద్రంలో సోమవారం నాడు జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకొని సోలిడాంద్ర బదిరుల పాఠశాలలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను కొనియాడారు చిన్నపిల్లలు అంటే జవహర్ లాల్ నెహ్రూ కి అమిత ప్రేమ అని నేటి బాలలే రేపటి పౌరులని తెలిపారు పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్లెట్ లు పంపిణీ చేసి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో. ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీ కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ , శ్రీమతి కట్టెబోయిన విజయలక్ష్మి, గాంధీ కళాశాల మెడికో కుమారి కట్టెబోయిన తేజస్విని ,
పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలల దినోత్సవం సందర్భంగా సోలిడాంద్ర బదిరుల పాఠశాలలో ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు




