అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నాంపల్లి జనవరి 10 (జనం సాక్షి )మండలంలో గానుగు పల్లి, మహమ్మదాపురం,గట్ల మల్లేపల్లి, తుమ్మలపల్లి,రేవెల్లి, మేలవాయి, పక్కీరపురం, కేతపల్లి గ్రామాలలో సిడిఎఫ్ ఎనర్జీ ఎస్ 4.కోట్ల 40 లక్షల నిధుల నుండి సి సి రోడ్ల నిర్మాణం కేతపల్లి, పకీర్ పురం నూతన గ్రామపంచాయతీ భవనలకు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మేలవాయి గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రని అభివృద్ధి చేస్తున్నది సీఎం కేసీఆర్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏడుదొండ్ల శ్వేతా రవీందర్ రెడ్డి , జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి , రైతు బంధు మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేనేపెళ్లి వెంకటేశ్వర్లు, కుంభం కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు బొల్లంపల్లి వెంకటేశ్వర్లు , సర్పంచులు కారింగు అహల్యమ్మ, కోరే హేమలత, గుండెబోయిన మైనమ్మ, అందుగుల కవిత, కొలుకులపల్లి సన్నయ్య, ఎంపిటిసి బత్తుల వంశి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే




