అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్.

రామకృష్ణాపూర్, జులై 15, (జనంసాక్షి) :

ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో విస్తృత పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రెండో వార్డులో నూతనంగా నిర్మించనున్న బృహత్ పట్టణ ప్రకృతి వనం 16 కోట్లతో నిర్మించనున్న రోడ్లకు సంబంధించి స్థానిక రాజు చౌక్లో కూడలను నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కల, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, బి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇంచార్జ్ గాండ్లసమ్మయ్య , కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు