పెంచికల్ పేటలో అత్యధికంగా ఆయిల్ పామ్, కంది సాగు

జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ 95 వ స్థాపిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఏడూ పెంచుకల్ పేట గ్రామంలో అత్యధికంగా ఆయిల్ పామ్, కందులు సాగు చేస్తున్నందున స్థాపిత దినోత్సవాన్ని పెంచికల్ పేట గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీకే (రామగిరి) వారు సహాయ – సహాకారం తో వ్యవసాయ శాఖ కమాన్ పూర్ సముఖ్యతంగా నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు డా .కిరణ్ , డా. వినోద్, డా భాస్కర్, డా.వెంకన్న , నవ్య (పోషకా ఆహార నిపుణరాలు ), డా.అర్చన (పశు వైద్యురాలు కేవీకే ) పాల్గొన్నారు. సర్పంచ్ వెంకటేష్ ,వైస్ ఎంపీపీ ఉప్పర ఉప్పరి శ్రీనివాస్, ఐకెపి ఏ పీ ఎం శైలజ, ఏఈఓ శ్రీనివాస్ తో పాటు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు