Thursday, 5 November 2026

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి

అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి* ఫోటో రైట్ అప్… అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి.
వనపర్తి బ్యూరో: నవంబర్ 22 (జనం సాక్షి) వనపర్తి పట్టణంలో అతి వేగవంతంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష,అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగవ్వన్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ,పనులను నాణ్యవంతంగా త్వరగా పూర్తి చేయాలని,కాంట్రాక్టర్లను, అధికారులను,ఆదేశించారు.
అభివృద్ధిలో వనపర్తి ఆదర్శంగా నిలవాలని,వనపర్తి మార్కెట్ పనులు వేగంగా చేపట్టాలి,
ప్రణాళికాబద్ధంగా వనపర్తి అభివృద్ధి చేపడుతున్నాం
నాలుగు దశాబ్దాల రోడ్ల విస్తరణను ప్రజల సహకారంతో,పూర్తిచేస్తున్నాం.వనపర్తి చుట్టూ ఉన్న చెరువులను పటిష్టం చేయడంతో జిల్లాకేంద్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో భూగర్భజలాలు అత్యధికంగా పెరిగింది వనపర్తి జిల్లాలోనే వనపర్తి మార్కెట్ ను రూ.49 కోట్లతో నూతనంగా నిర్మించాం,రూ.4 కోట్లతో ఎకో పార్క్ ను అభివృద్ధి చేశాం.
రూ.2 కోట్లతో “వే సైడ్ మార్కెట్” నిర్మిస్తున్నాం.
నగరం నాలుగు దిక్కులా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్, సహకారంతోనే,ఈ అభివృద్ధి సాధ్యమయిందని ఈ సందర్భంగా తెలియజేశారు. తదనంతరం మంత్రి వనపర్తి జిల్లాకేంద్రంలో మోడల్ మార్కెట్ పనులు పరిశీలించి , రాజపేట సమీపంలో నూతన పార్క్ పనులను పరిశీలించారూ. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, అధ్యక్షులు పలస రమేష్ గౌడ్, ప్రేమ్ నాథ్ రెడ్డి, ఉత్తమ్,రవి,రఘు, వెంకటరమణ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.