మండల స్థాయి చెకుముకిపోటీలు
మల్దకల్ నవంబర్ 22(జనం సాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో మంగళవారము మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీలలో జడ్.పి.హెచ్.ఎస్ అమరవాయి విద్యార్థులు తెలుగు మీడియం విభాగంలో,జడ్పీహెచ్ఎస్ మల్దకల్ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇమ్మానియేల్ ,జన విజ్ఞాన వేదిక మండల ప్రెసిడెంట్ పి రామన్న,జనరల్ సెక్రెటరీ బి రుషిరాజు,వివిధ ఉన్నత పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




