అమర వీరుల జ్యోతి యాత్ర ప్రారంభం..
దేవరుప్పుల, డిసెంబర్ 05(జనం సాక్షి):దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ 35వ మహాసభ’ల సందర్భంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో , కడవెండి గ్రామంలో దొడ్డి కొమురయ్య స్తూపం వద్ద నుండి కేరళ రాష్ట్రం త్రిశూర వరకు అమరవీరుల జ్యోతి యాత్ర ప్రారంభ బహిరంగ సభ కడవెండి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ ప్రారంభ బహిరంగ సభకు తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథిగా ఈ సభను అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపా ధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి పి కృష్ణ ప్రసాద్,తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సీనియర్ నాయకులు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకటరాజు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోపు కనకారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్,బస్వ సావిత్రి,సర్పంచ్ పోతిరెడ్డి బేతిలిన,దొడ్డి కొమరయ్య వారసుడు దొడ్డి బిక్షపతి, తదితరులు,పాల్గొన్నారు.




