
అమలాపురం టు షిరిడి సైకిల్ యాత్ర…
భైంసా రూరల్ డిసెంబర్ 16 జనం సాక్షి
– నేడు బైoసా లో సాయిదీక్ష స్వాములు.
ఆంధ్రప్రదేశ్ అమలాపురం ఉప్పలగుప్తం గ్రామం నుండి సైకిల్ యాత్రగా షిరిడి కి ప్రయాణమవుతున్న సాయిదీక్ష స్వాములు శుక్రవారం బైంసాకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ సైకిల్ యాత్ర ప్రారంభించి ఈ రోజుతో తొమ్మిదో రోజు అని,ఏ రూపంలో కొలిచిన దేవుడు ఒక్కడేనని భక్తితో శ్రద్ధతో నమ్మిన దైవాన్ని కొలిస్తే అంతకు మించిన ధర్మం లేదంటూ తెలిపారు. పేద,నిరుపేదలకి మనిషి తన వంతుగా తాను సహాయం చేస్తూ ఉండాలని తెలిపారు. నేడు బైంసా నుండి బాసర వెళ్ళీ ఆ తర్వాత నాందేడ్ మీదుగా షిరిడి చేరుకోనున్నట్లు తెలిపారు.




