అమెజాన్‌లో ఐ.ఫోన్‌ల ఆఫర్లు

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి):ఈ-కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ‘ఐఫోన్‌ ఫెస్ట్‌’ పేరిట వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు ఐఫోన్‌ మోడల్స్‌పై వినియోగదారులకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు, భారీ రాయితీలు లభిస్తున్నాయి. ఈ సేల్‌ డిసెంబర్‌ 9వ తేదీ వరకు కొనసాగనుంది. కాగా ఐఫోన్‌ ఫెస్ట్‌లో భాగంగా 32 జీబీ ఐఫోన్‌ 7 రూ.41,999కే వినియోగదారులకు లభిస్తున్నది. దీని అసలు ధర రూ.49వేలుగా ఉంది. దీంతోపాటు 128 జీబీ ఐఫోన్‌ 7 రూ.51,999 ధరకు (అసలు ధర రూ.58వేలు), ఐఫోన్‌ 7 (256 జీబీ) రూ.53,999 ధరకు (అసలు ధర రూ.74,400), ఐఫోన్‌ ఎస్‌ఈ 32జీబీ రూ.19,999 ధరకు (అసలు ధర రూ.26వేలు) లభిస్తున్నాయి. పైన తెలిపిన ఐఫోన్‌ మోడల్స్‌ కోసం వినియోగదారులు తమ పాత ఐఫోన్లను ఎక్స్‌ఛేంజ్‌ కూడా చేసుకోవచ్చు. అందుకు రూ.9,500 వరకు ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి ఐఫోన్స్‌ను కొనుగోలు చేస్తే మరో రూ.2వేల వరకు అదనంగా ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే పైన తెలిపిన ఐఫోన్‌ మోడల్స్‌ మాత్రమే కాకుండా ఐఫోన్‌ 6, 6ఎస్‌, 7 ప్లస్‌, ఐఫోన్‌ 8, 8 ప్లస్‌ మోడల్స్‌పై కూడా అమెజాన్‌ ఆఫర్లను అందిస్తున్నది.