.
ఫొటో : అన్నదానం చేస్తున్న అమ్మఒడి సభ్యులు.బెల్లంపల్లి, ఏప్రిల్ 5, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియా బస్టాండ్ వద్ద బుధవారం అమ్మఒడి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈసందర్భంగా అమ్మఒడి అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమండ్ల మధుకర్ మాట్లాడుతూ అమ్మఒడి సంస్థ స్థాపించి మూడేళ్లు గడిచిందని, ఈ మూడేళ్ళ కాలంలో ప్రతి ఆదివారంతో పాటు వివిధ కార్యక్రమాల సందర్బంగా నిర్విరామంగా అన్నదానం చేపట్టమని అన్నారు. అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలి బాధను తగ్గించడానికి తమ వంతు సాయంగా అన్నదానం కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. అమ్మఒడి మూడవ వార్షికోత్సవం సందర్బంగా అమ్మఒడి వ్యవస్థాపకుడు అజ్మీరా మోహన్, పేరు చెప్పుకోవడానికి ఇష్టపడని దాత సహకారంతో 179వ సారి అన్నదానం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా పల్లేటూరి బస్టాండ్ నందు యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు,బాటసారులకు సుమారు 200 మందికి అన్నదానం చేశామన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం సంతోషాన్నిచ్చిందన్నారు ఈరోజు దాతలందరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బెల్లంపల్లి ఒకటో పట్టణ ఎస్సై మేకల సంతోష్ మాట్లాడుతూ అమ్మఒడి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఈకార్యక్రమంలో అమ్మ ఒడి సభ్యులు హనుమండ్ల సువర్ణ, గన్నెవరం తిరుమల చారి, లెంకల శ్రావణ్ కుమార్, బుకాల రంజిత్ కుమార్, హనుమండ్ల నారాయణ, మల్లక్క, రాజేశం, సరిత, కీర్తి, కల్పన, దోమల మధుకర్, ఎండి యూసుఫ్, చందుపట్ల లింగన్న, కామెర శివ పాల్గొన్నారు.




